Back to FeedQuickToday Shorts

Andhra Pradesh
Sep 9, 2026Short Read
APలో ద్రోణి ప్రభావం: పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు!
ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
అలాగే అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.





